Parthiv Patel| ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025(IPL 2025)కి మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఈనెలలో ఆటగాళ్ల మెగా వేలం జరగనుంది. ఈ తరుణంలోనే ఫ్రాంచైజీలు తమ సహాయక సిబ్బందిని నియమించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్‌ను తమ కోచింగ్ స్టాఫ్‌లోకి తీసుకుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. టైటాన్స్ జట్టుకు బ్యాటింగ్, అసిస్టెంట్ కోచ్‌గా పార్థివ్‌ను నియమిస్తున్నట్లు మేనేజ్మెంట్ తెలిపింది. కాగా గతంలో ముంబై ఇండియన్స్ (MI)కి స్కౌట్‌గా, ముంబై ఎమిరేట్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పార్థివ్ పనిచేశాడు.
ఇదిలా ఉంటే పార్థివ్ పటేల్.. ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ , కొచ్చి టస్కర్స్ కేరళ, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లకు ఆడాడు. మొత్తం139 IPL మ్యాచ్‌లలో కలిపి 22.6 సగటుతో 2,848 పరుగులు చేశాడు. ఇందులో 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక భారత జట్టు తరుపున 25 టెస్టుల్లో 31 సగటుతో కేవలం 934 పరుగులు మాత్రమే చేయగా.. 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 38 వన్డేల్లో 736 పరుగులు చేయగా.. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.