Friday, November 15, 2024
Homeనేషనల్Mahayuti alliance: మహారాష్ట్ర ఎన్నికలు.. 'మహాయుతి'లో విభేదాలు

Mahayuti alliance: మహారాష్ట్ర ఎన్నికలు.. ‘మహాయుతి’లో విభేదాలు

Mahayuti alliance| మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharastra Assembly Elections)కు ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ తరుణంలో బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమిలో విభేదాలు తలెత్తాయి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఈ విభేదాలకు కారణమైంది.

- Advertisement -

అసలేం జరిగిందంటే.. యోగి మాట్లాడుతూ ‘‘బాటేంగే తో కటేంగే’’(విడిపోతే నాశనమైపోతాం) అనే నినాదం ప్రజలకు ఇచ్చారు. అయితే ఈ నినాదంపై బీజేపీ నేతలతో పాటు కూటమిలో ఎన్సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar)కూడా తీవ్ర అసంతృప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆ నినాదాన్ని తాను సమర్థించనని తెలిపారు. దీని గురించి ఇప్పటికే చాలా సార్లు చెప్పానని.. ఈ నినాదం బహుశా ఝార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పనిచేస్తుందేమో గానీ మహారాష్ట్రలో దీనికి స్థానం లేదు అని స్పష్టంచేశారు.

తాజాగా ఈ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌(Devendra Fadnavis) స్పందించారు. అజిత్‌ పవార్‌ కొన్ని దశాబ్దాల పాటు హిందూ వ్యతిరేక సిద్ధాంతాలతో కలిసి పనిచేశారన్నారు. అందుకే ఇంకా ఆయనపై మాజీ మిత్రుల ప్రభావం ఉన్నట్లుందని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలను అర్థం చేసుకునేందుకు పవార్‌కు ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. దీంతో కూటమి నేతల మధ్య విభేదాలు క్యాడర్‌కు మింగుడు పడటం లేదు. కాగా రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 23న ఫలితాలు విడుదల కానున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News