Friday, November 15, 2024
Homeచిత్ర ప్రభNaga Chaitanya: నా ఫ్యామిలీ ఇలా ఉండాలి: నాగ చైతన్య

Naga Chaitanya: నా ఫ్యామిలీ ఇలా ఉండాలి: నాగ చైతన్య

Naga Chaitanya| అక్కినేని యువ హీరో నాగచైతన్య త్వరలోనే మరో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్న చైతన్య.. డిసెంబర్ 4న ఆమెను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలోనే తనకు పిల్లలు ఎంత మంది కావాలో ఓపెన్ అయ్యాడు. ఆయన బంధువు, హీరో రానా దగ్గుబాటి హోస్ట్ చేస్తున్న ‘ది రానా దగ్గుబాటి షో’ (The Rana Daggubati Show) సెలబ్రిటీ టాక్‌ షోలో పాల్గొన్నాడు. తాజాగా టాక్ షోకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.

- Advertisement -

ఈ షోలో ‘‘నీ కుటుంబం ఎలా ఉండాలని అనుకుంటున్నావు?’’ అని రానా ప్రశ్నించగా.. హ్యాపీగా పెళ్లి చేసుకుని.. కొంతమంది పిల్లలు ఉంటే చాలు అని చైతన్య సమాధానం ఇచ్చాడు. దీనికి రానా మాట్లాడుతూ “కొంతమంది పిల్లలు అంటే వెంకీ మామ లాగా పిల్లలు ఉండాలా” అని అడగ్గా.. “అంతమంది అవసరం లేదు.. కపుల్ ఆఫ్‌ కిడ్స్” అంటూ చెబుతాడు. ఈ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకేంటేంది.

ఇక ఈ టాక్‌ షోలో రాజమౌళి, నాని, ప్రియాంక మోహన్‌, నాగచైతన్య, దుల్కర్‌ సల్మాన్‌, రిషభ్‌ శెట్టి, సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీలీలతోపాటు రానా సతీమణి మిహికా బజాజ్‌ కూడా పాల్గొన్నారు. రానాతో ఎన్నో సరదా విషయాలు పంచుకున్నారు. కాగా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నవంబర్ 23 నుంచి ఈ టాక్ షో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే చైతన్య నటించిన ‘తండేల్’ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News