Friday, November 15, 2024
HomeతెలంగాణIndira Mahila Shakti | వారంతా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి -భట్టి

Indira Mahila Shakti | వారంతా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి -భట్టి

ఇందిరా మహిళా శక్తి పథకం (Indira Mahila Shakti Scheme) ద్వారా గ్రామాల్లోని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశించారు. శుక్రవారం ప్రజాభవన్ లో జరిగిన అధికారుల సమావేశంలో స్వయం సహాయక సంఘాలపై చర్చలు జరిపారు. స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్ల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ఉత్పత్తికి త్వరితగతన చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన స్థలాలను సేకరించి వారికి లీజుకు ఇవ్వాలని తెలిపారు.

- Advertisement -

సోలార్ పవర్ ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక నిధులకు గాను బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించే ఏర్పాటు చేయాలని భట్టి అధికారులకు సూచించారు. రుణాల రీ పేమెంట్ లో స్వయం సహాయక సంఘాల సభ్యులు 99 శాతం ప్రగతిని కనబరుస్తున్నారని, వీరికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తిగా ఉన్నారని చెప్పారు.

Also Read : ‘డాంకీ ప్యాలెస్’ ఘరానా మోసం.. తెలిస్తే షాకే!!

ఇటీవల బ్యాంకర్ల సమావేశంలోనూ స్వయం సహాయక సంఘాల సభ్యులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాట్ల ఏర్పాటు, ఆర్టీసీకి బస్సుల సమకూర్చేటటువంటి మరిన్ని పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్పష్టం చేశామని, వారు కూడా విరివిగా రుణాలు అందించి ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం అధికారులకు వివరించారు.

ఇందిరా మహిళా శక్తి పథకం (Indira Mahila Shakti Scheme) ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతనిచ్చి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ద్వారా సామాజిక మార్పు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలపడితే గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులకు డిప్యూటీ సీఎం వివరించారు.

ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్, SERP సీఈఓ దివ్య దేవరాజన్, ట్రాన్స్కో సీఎం డి కృష్ణ భాస్కర్, రెడ్కో వైస్ చైర్మన్, ఎండి వావిలాల అనీల తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News