Monday, April 14, 2025
HomeతెలంగాణOrtus International School: ఆర్టస్ ఇంటర్నేషనల్ స్కూల్ లోగో-బ్రోచర్ ప్రారంభం

Ortus International School: ఆర్టస్ ఇంటర్నేషనల్ స్కూల్ లోగో-బ్రోచర్ ప్రారంభం

టెక్నాలజీతో చదువులు..

కోకాపేట్‌లో ఆర్టస్ ఇంటర్నేషనల్ తన మొదటి క్యాంపస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వినూత్నమైన, సాంకేతికత, సంపూర్ణమైన అభ్యాసానికి ఇది కేంద్రంగా నిలవనుంది. ఆర్టస్ సీబీఎస్ఈ, కేంబ్రిడ్జ్ సిలబస్‌ల ప్రత్యేకమైన సమ్మేళనాన్ని అందిస్తుంది. కృత్రిమ మేధా సాంకేతికత, మానవ విలువలు, సృజనాత్మక ఆలోచనలతో సరికొత్త అభ్యాసాన్ని ఇక్కడ అందించనున్నారు.

- Advertisement -

ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి..

ఈ సందర్భంగా గచ్చిబౌలి లోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాఠశాల నిర్వాహకుడు, విద్యావేత్త డాక్టర్ ప్రసన్న మండవ మాట్లాడుతూ… మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడంలో సాంప్రదాయ పద్ధతులు చాలా తక్కువగా ఉన్నాయని మేము గుర్తించాము. ఆర్టస్ సమగ్రమైన, విలువ-ఆధారిత విధానాన్ని ప్రారంభించింది, సాంకేతికత, ప్రాజెక్ట్‌లోని తాజా పోకడలతో నాన్-లీనియర్ బోధనా విధానాన్ని ఏకీకృతం చేస్తుందన్నారు. విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా వారిని ఆయా రంగంలో ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు. సహ వ్యవస్థాపకులు నాగ తుమ్మల మాట్లాడుతూ.. “వైవిధ్యమైన అభ్యాస విధానాలు, సాంకేతికత అభ్యాసం ద్వారా ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నా”మన్నారు. ఓక్రిచ్ వికాస్ ఓయు పాఠశాలలను సమర్ధవంతంగా ముందుకు సాగించిన రాజ్ యార్లగడ్డ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి పాఠశాల వాతావరణాన్ని ఇక్కడ అందిస్తున్నామన్నారు, చదువుకునే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఈ పాఠశాల సరికొత్త అభ్యాస కేంద్రంగా నిలుస్తుందన్నారు.

కార్యక్రమంలో రిటైర్డ్ ఐఆర్‌ఎస్ కరుణాకరరావు దాసరి, మహేశ్ లంకిపల్లి, అనిరుధ్ రెడ్డి జిల్లెల, యసస్విని మండవ, నితిన్ రెడ్డి జిల్లెల తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News