Friday, November 15, 2024
HomeతెలంగాణSingareni | లాభాల్లో తగ్గేదే లే అంటోన్న సింగరేణి

Singareni | లాభాల్లో తగ్గేదే లే అంటోన్న సింగరేణి

సింగరేణి (Singareni) సంస్థ లాభాల బాటలో దూసుకెళుతోంది. తీవ్ర వర్ష ప్రభావాన్ని అధిగమించి, తన వినియోగదారులకు తగినంత బొగ్గును సరఫరా చేస్తోంది. ఫలితంగా గడచిన ఏడు నెలల కాలంలో గతేడాదితో పోల్చితే వెయ్యి కోట్ల కన్నా ఎక్కువ లాభం గడించి సింగరేణి సంస్థ ముందుకు దూసుకుపోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్థ భాగంలో భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి కొన్ని అవాంతరాలు ఏర్పడినప్పటికీ వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇప్పుడు మళ్లీ ఉత్పత్తి వేగంగా ఊపందుకుంది.

- Advertisement -

ఇదే ఒరవడిని కొనసాగిస్తూ వార్షిక ఉత్పత్తి లక్ష్యం 720 లక్షల టన్నులను సాధించాలని సింగరేణి (Singareni) వ్యాప్త అధికార యంత్రాంగం సమాయత్తమై పనిచేస్తుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు బొగ్గు అమ్మకం ద్వారా రూ.17151 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.2286 కోట్ల టర్నోవర్ను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు బొగ్గు, థర్మల్ విద్యుత్ అమ్మకాల ద్వారా పన్ను చెల్లింపునకు ముందు రూ.4 వేల కోట్ల స్థూల లాభాన్ని కంపెనీ ఆర్జించింది. గతేడాది ఇదే సమయానికి ఆర్థించిన రూ.2932 కోట్ల మీద ఇది 1072 కోట్లు అదనం కావడం విశేషం. మొత్తమ్మీద గతేడాదితో పోల్చితే స్థూల లాభంపై 36 శాతం వృద్ధి నమోదైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News