Monday, June 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Nara Ramamurthy Naidu: సీఎం చంద్రబాబు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమం

Nara Ramamurthy Naidu: సీఎం చంద్రబాబు సోదరుడి ఆరోగ్య పరిస్థితి విషమం

ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) సోదరుడు నారా రామ్మూర్తి నాయడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కొద్దిరోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్‌ బయల్దేరివెళ్లారు.

- Advertisement -

మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు కూడా హైదరాబాద్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా సినీ హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు అనే సంగతి తెలిసిందే. ఇటీవల రోహిత్ నిశ్చితార్థం జరిగిన విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News