నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై టీడీపీ, జనసేన నేతలు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు అయింది. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రి నారా లోకేష్(Nara Lokesh)పై పోసాని అనుచిత వాఖ్యలు చేశారంటూ కడప జిల్లాలోని రిమ్స్ పోలీస్ స్టేషన్లో టీడీపీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు భాస్కర్ ఫిర్యాదుచేశారు.వారి ఫిర్యాదు మేరకు పోలీసులు పోసానిపై కేసు నమోదుచేశారు.
ఇప్పటికే రాజంపేట పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటివరకు పోసాని మీద మొత్తం 50కి పైగా ఫిర్యాదులు అందినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు నమోదైన కేసుల్లో విచారణకు హాజరు కావాలని పోసానికి రెండు లేదా మూడు రోజుల్లో నోటీసులు ఇస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పెదలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అనంతపురంలో పోసాని దిష్టి బొమ్మను తెలుగు యువత, ఎస్సీ సెల్ నాయకులు దహనం చేశారు. మరోవైపు నటి శ్రీరెడ్డిపై సైతం రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి.