Saturday, November 16, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: గ్రూప్‌ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయాలి: షర్మిల

YS Sharmila: గ్రూప్‌ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయాలి: షర్మిల

గ్రూప్ 2 ఉద్యోగాల తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్ ఉద్యోగాలకి 1:100 విధానాన్ని అనుసరించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

- Advertisement -

‘ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu)గారు.. రాష్ట్రంలోని గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రూప్ 2, డిప్యూటీ ఈవో పోస్టుల ఎంపికలో అనుసరించిన 1:100 విధానాన్ని, గ్రూప్ 1 మెయిన్స్‌కి సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాం. జీవో నెంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీ (APPSC)కి ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉంది. 89 పోస్టులకు మీరు ఇచ్చిన 1:50 రేషియో ద్వారా 4450 మంది మెయిన్స్ కి అర్హత పొందారు. 1:100 రేషియో లెక్కన పిలిస్తే మరో 4450 మందికి అవకాశం దక్కుతుందని అభ్యర్థులు ఆశ పడుతున్నారు.

రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షల మధ్య సమయం తక్కువగా ఉండటం, సిలబస్ మధ్య వ్యత్యాసం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్‌లోనే పరీక్షలు నిర్వహించడం లాంటి కారణాలతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ఉద్యోగాలు మళ్ళీ పోతే ఇప్పట్లో ఇక నోటిఫికేషన్ ఉండదని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ని కలిసి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్స్ షెడ్యూల్ విడుదల కాకముందే అభ్యర్థుల విజ్ఞప్తులను పరిశీలించి, న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’ అని ఆమె రాసుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News