Friday, April 4, 2025
Homeఆంధ్రప్రదేశ్Revanth Reddy: చంద్రబాబు సోదరుడి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

Revanth Reddy: చంద్రబాబు సోదరుడి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి

Revanth Reddy| ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు(Nara Rammurthy Naidu) మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

- Advertisement -

“ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గారి సోదరుడు… మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి దిగ్భ్రాంతికరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ పేర్కొన్నారు.

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా స్పందిస్తూ “శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారు పరమపదించారని తెలిసి విచారించాను. వారు నాకు సన్నిహితులు. చంద్రగిరి శాసనసభ్యులుగా వారు అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. వారి సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.” అని ట్వీట్ చేశారు.

ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిల కూడా రామ్మూర్తి నాయుడు పట్ల సంతాపం తెలియజేశారు. “ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గారి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడి గారు హఠాన్మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. చంద్రబాబు గారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.” ట్వీట్ చేశారు.

వీరితో పాటు ఏపీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు రామ్మూర్తి నాయుడి మృతి పట్ల తమ సంతాపం తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News