తెలంగాణ ప్రజల ఆరోగ్యంపై డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రెండో రౌండ్ డయాబెటిస్, బీపీ వ్యాధుల స్క్రీనింగ్, డయాగ్నసిస్, ట్రీట్‌మెంట్ లో నివ్వెర పరిచే ఆరోగ్య నిజాలు వెలుగు చూశాయి.
44% మందికి బీపీ, 46% మందికి షుగర్
రాష్ట్రంలో 30 ఏళ్లకు పైబడిన వారి సంఖ్య మొత్తం 1, 68, 86, 372 (ఒక కోటి అరవై ఎనిమిది లక్షల మూడు వందల డెబ్బయి రెండు ) మంది ఉండగా, వారిలో 1, 50, 28, 690 ( ఒక కోటి యాభై లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల తొంభై) మందికి పరీక్షలు నిర్వహించాలన్నది ప్రభుత్వ టార్గెట్. ఇప్పటికి 89 శాతం మందికి బీపీ, షుగర్ వ్యాధుల స్క్రీనింగ్, డయాగ్నసిస్ పూర్తయింది. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో 44 శాతం మందికి బీపీ, 46 శాతం షుగర్ ఉందని తేలింది. బీపీ, షుగర్ లలో నల్గొండది ఫస్ట్ ర్యాంక్. ఆ జిల్లాలో 1, 39, 768 మందికి బీపీ, 72, 824 మందికి షుగర్ ఉన్నట్లు తేలింది. 50, 444 మందితో బీపీలో సెకండ్ ప్లేస్ కామారెడ్డికి, 49, 253 మందితో హనుమకొండ మూడో స్థానంలో ఉంది.
బీపీ, షుగర్ లలో నల్గొండది ఫస్ట్ ర్యాంక్
షుగర్‌లోనూ మొదటిస్థానం నల్గొండకే దక్కగా, 95, 523 మందితో హనుమకొండ రెండో స్థానంలో , 90,317 మందితో కామారెడ్డి మూడో స్థానంలో ఉంది. ఇక బీపీ, షుగర్ రెండు అత్యల్పంగా ఉన్న జిల్లాగా ములుగు మొదటిస్థానంలో ఉండగా, కొమరం భీం, జయశంకర్ జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
టాప్ త్రీలో నల్గొండ, కామారెడ్డి, హనుమకొండ
ఆదిలాబాద్ జిల్లాలో 3, 33 441 మందికి గాను 33, 099 మందికి బీపీ, 13, 827 మందికి షుగర్ ఉంది. భద్రాద్రి జిల్లాలో 5, 22, 792 మందికి పరీక్షలు నిర్వహించగా, 64, 230 మందికి బీపీ, 33, 760 మందికి డయాబెటిస్ ఉంది. హన్మకొండలో 4, 59, 315 మందికి గాను 95, 523 మందికి బీపీ, 49, 283 మందికి షుగర్ ఉన్నాయి. హైదరాబాద్‌లో 11, 75, 517 మందికి పరీక్షలు నిర్వహించగా, 73, 669 మందికి బీపీ, 43003 మందికి షుగర్ ఉన్నాయి. జగిత్యాలలో 5, 11, 843 కు గాను 80919 మందికి బీపీ, 38360 మందికి షుగర్ ఉంది.
జనగాన్‌లో 256632 మందికి గాను 36354 మందికి బీపీ, 16, 358 మందికి షుగర్ ఉంది. జయశంకర్ జిల్లాలో 17926 మందికి బీపీ, 8685 మందికి షుగర్ ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో 48345 మందికి బీపీ, 22, 924 మందికి షుగర్ ఉంది. కామారెడ్డిలో 90,317 మందికి బీపీ, , 60,444 మందికి షుగర్‌లు ఉన్నాయి. కరీంనగర్‌లో 50450 మందికి బీపీ, 24, 165 మందికి షుగర్ ఉన్నట్లు తేలింది. ఖమ్మంలో 71, 791 మందికి బీపీ, 24, 165 మందికి షుగర్ ఉంది. కొమరం భీం జిల్లాలో 16, 280 మందికి బీపీ, 5683 మందికి షుగర్ ఉంది.
మహబూబాబాద్‌లో బీపీ 51, 229 మందికి, షుగర్ 27, 410 మందికి ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో 74447 మందికి బీపీ, 44, 870 మందికి షు గర్ ఉంది. మంచిర్యాల్‌లో 56, 729 మందికి బీపీ, 24, 400 మందికి షుగర్ ఉంది. మెదక్‌లో బీపీ పేషెంట్లు 85469 మంది ఉండగా, 51, 819 మందికి షుగర్ ఉంది. మేడ్చల్ మల్కాజ్ గిరిలో 37788 మందికి బీపీ, 22939 మందికి షుగర్ ఉంది. ములుగు జిల్లాలో 13, 587 మందికి బీపీ ఉండగా, 5581 మందికి షుగర్ ఉంది. నాగర్ కర్నూల్ జిల్లాలో 77, 245 మందికి బీపీ, షుగర్ 38614 మందికి ఉంది. నల్గొండలో 1, 39, 768 మందికి బీపీ, 72, 824 మందికి షుగర్ ఉంది. నారాయణ్‌పేట్‌లో 42975 మందికి బీపీ, 23, 147 మందికి షుగర్ ఉంది. నిర్మల్ జిల్లాలో 72, 974 మందికి బీపీ, 38, 453 మందికి షుగర్ ఉంది. నిజామాబాద్‌లో 72, 974 మందికి బీపీ, 38, 453 మందికి షుగర్ ఉంది. పెద్దపల్లిలో 42, 198 మందికి బీపీ, 17,862 మందికి షుగర్ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 39, 791 మందికి బీపీ, 29, 401 మందికి షుగర్ ఉంది. రంగారెడ్డి జిల్లాలో 53360 మందికి బీపీ 29401 షుగర్, సంగారెడ్డిలో 55 673 మందికి బీపీ, 27, 950 మందికి షుగర్ ఉంది. సిద్ధిపేట్‌లో 51021 మందికి బీపీ, 24075 మందికి షుగర్ ఉంది. సూర్యాపేట్‌లో బీపీ 68093 మందికి, షుగర్ 44, 498 మందికి ఉంది. వికారాబాద్‌లో 65027 మందికి బీపీ, 30, 690 మందికి షుగర్ ఉంది. వనపర్తిలో 36, 454 మందికి బీపీ, 30690 మందికి షుగర్ ఉంది. వరంగల్లులో బీపీ పేషెంట్లు 74562, 38,293 మందికి షుగర్ నిర్ధారణ జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 45, 111 మందికి బీపీ, 23, 962 మందికి షుగర్ ఉన్నట్లు తేలింది.