మండల కేంద్రంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం రోజున అత్యంత వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పురాతన ఆచారం ప్రకారం గరుడ వాహనంపై శ్రీ రుక్మిణి సత్యభామ సామెత శ్రీ వేణుగోపాల స్వామి వారిని సాంప్రదాయకరంగా గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. బజంత్రీలతో స్వామివారిని చూడముచ్చటగా అలంకరించిన రథం వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయ పురోహితులు నవీన్ చారి, గోపాలాచారి ఆధ్వర్యంలో వేద పండితులు వేదమంత్రాల మధ్య స్వామికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి రథంపై ఊరేగించారు. రథోత్సవాన్ని తిలకించడానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే. మహేందర్ రెడ్డి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
మండల ప్రజలతోపాటు ముస్తాబాద్,వీర్నపల్లి, కోనరావుపేట, గంభీరావుపేట, మాచారెడ్డి వివిధ మండలాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి మొదటి లడ్డు వేలం పాటలో బొమ్మ కంటి అభిమన్యు 50వేల 116రూ.లకు దక్కించుకోగా రెండవ లడ్డు 25వేల 116 రూ. లకు ముద్ర కోల సంతోష్ మూడవ లడ్డు 25వేల16 రూ.లకు చందుపట్ల మహేందర్ రెడ్డి దక్కించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్, వైస్ చైర్మన్ గంట వెంకటేష్, మాజీ జెడ్పిటిసి లక్ష్మణ్ రావు ,సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, రెడ్డి సంఘం మండల అధ్యక్షుడు గుండాడి వెంకట్ రెడ్డి, నంది కిషన్, మేగీ నర్సయ్య, చందుపట్ల లక్ష్మారెడ్డి, ముత్యాల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీ.ఐ. శ్రీనివాస్ ఎస్ఐ. రామాకాంత్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నడుమ రథోత్సవం జరిగింది.