Sunday, November 17, 2024
Homeఇంటర్నేషనల్Tulsi Gabbard-A fire brand: నిఘా సంస్థల గుండెల్లో ఫైర్ బ్రాండ్ తులసి గబార్డ్

Tulsi Gabbard-A fire brand: నిఘా సంస్థల గుండెల్లో ఫైర్ బ్రాండ్ తులసి గబార్డ్

డీఎన్ఐగా తులసీ మార్క్..

తులసి గబార్డు అమెరికాకు తొలి హిందూ ఇంటెలిజెన్స్ చీఫ్. పార్లమెంటేరియన్ గా భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేసి ఎందరో ద్రుష్టిని ఆకర్షించిన విలక్షణ వ్యక్తి. డెమోక్రాట్ రాజకీయాల నుంచి ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ సిద్ధాంతం తులసీనీ రిపబ్లికన్ రాజకీయాల వైపు అడుగువేసేలా చేసింది. తులసీ ‘విదేశాంగ విధానాలు, అభిప్రాయాలు’ ఆమెను సర్వత్రా ఎంతో వివాదాస్పదురాలిని చేశాయి. అమెరికా మిలటరీ వ్యూహాలపై ఆమె చేసిన విమర్శలూ తులసీని ఒక సంచలనంగా మార్చాయి. తులసి స్వతంత్ర పోకడలు సైతం ఆమెను ఎప్పుడూ వార్తల్లో ఉండేలా చేస్తాయి. అమెరికా మిలటరీ జోక్యాన్నీ సైతం తీవ్రంగా తప్పుపట్టారామె. ఇలా ఎంతో వివాదాస్పదురాలైన తులసీ గబార్డును అమెరికా ఇంటెల్జెన్సీ చీఫ్ గా ప్రకటించి ట్రంప్ ఇపుడు స్వదేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా నిఘా వర్గాల్లో అసహనాన్ని రేకెత్తిస్తున్నారు. తులసి ప్రో-రష్యన్ స్టాండ్ పై ఎన్నో దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇంటెల్జెన్సీ చీఫ్ గా తులసీ గబార్డ్ ప్రయాణం ఎంతమేర, ఎంతకాలం సక్సెస్ ఫుల్ గా సాగుతుందన్న దానిపై పెద్దెత్తున అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

ఇక్కడ కనిపిస్తున్న మహిళ తులసి గబార్డ్. 43 సంవత్సరాల తులసి అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమితులయ్యారు. అమెరికాకు మొట్టమొదటి హిందూ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఆమె. అమెరికా వ్యాప్తంగా ఉన్న 18 నిఘా సంస్థలకు ఆమె డైరక్టరుగా వ్యవహరిస్తారామె. తులసి అన్న ఆమె పేరు చూసి చాలామంది ఆమె భారతీయ సంతతి అనుకుంటారు. కానీ కాదు. భారత్ తో ఆమెకు గానీ, ఆమె పూర్వికులకు గానీ ఎలాంటి సంబంధాలు లేవు. తులసి 2012 లో తాను అమెరికన్నే అని సోషల్ మీడియాలో స్పష్టంగా పేర్కొన్నారు కూడా.


భగవద్గీతపై ప్రమాణం చేసి…
2013లో ఆమె హవాయూ పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. ఇక్కడ కూడా తులసి ఒక రికార్డు స్రుష్టించారు. తులసి తొలి హిందూ మహిళా పార్లమెంట్ సభ్యురాలు కూడా. తులసి గురించి చెప్పాల్సిన మరో విషయం ఉంది. పార్లమెంట్ లో తొలిసారిగా ప్రమాణస్వీకారం చేసేటప్పుడు భగవద్గీతపై ప్రమాణం చేసి అందరి ద్రుష్టినీ ఆకర్షించారు.

తులసి పూర్వికులకు భారత్ దేశంతో ఎలాంటి సంబంధం లేదు. 1981, ఏప్రిల్ 12న అమెరికాలోని లియోనోలాలో తులసి జన్మించారు. తులసి తల్లి కారోల్ ఇండియానాకు చెందిన మహిళ. తులసికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ల కుటుంబం హవాయి దీవుల్లో స్థిరపడ్డారు. – సమోన్ అమెరికన్ దంపతులకు ఆమె జన్మించారు. తల్లి కరోల్ కి హిందూ మంతం అంటే మొదట్నించి ఎంతో అభిమానం. హవాయ్ లో ఉన్నప్పుడు మొదలైన ఈ ఆసక్తే చివరకు ఆమె జీవితమార్గమైంది. అలా ఆమె హిందూ మతాన్ని స్వీకరించారు. కరోల్ తన పిల్లలందరికీ భక్తి, జయ్, ఆర్యన్, తులసి, బ్రుందావన్ అని హిందూ పేర్లే పెట్టారు. తల్లికి మల్లేనే తులసి కూడా హిందూమతాన్ని ఆచరిస్తారు. వైష్ణవ సంప్రదాయాన్నిఅనుసరిస్తారు. భగవద్గీత పఠనం, ఇస్కాన్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటుంటారు. గబార్డు కుటుంబానికి మరో ప్రత్యేకత
కూడా ఉంది. ఈ కుటుంబానికి బహుళ జాతి, సంస్క్రుతులు, భిన్న మతవిశ్వాసాలున్న కుటుంబంగా మంచి పేరుంది.
సైన్యంలో ఇరవై ఏళ్లు…
తులసి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టా తీసుకున్నారు. అమెరికా ఆర్మీ నేషనల్ గార్డ్స్ లో 20 ఏళ్ల పాటు పనిచేశారు. అంతేకాదు అమెరికా సైన్యం తరపున కువైట్, ఇరాక్ లలో కూడా విధులు నిర్వర్తించారు. ప్రారంభంలో తులసి డెమొక్రాటిక్ పార్టీలో చురుగ్గా పాలు పంచుకున్నారు. ఆ పార్టీలో తగినంత గుర్తింపు లభించకపోవడంతో 2022 లో రిపబ్లికన్ పార్టీలో చేరారు. అంతేకాదు ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ముందుండి నడిపించిన ప్రముఖుల్లో తులసి గబార్డు కూడా ఉన్నారు. ట్రంప్ తులసిని గుర్తించ దగ్గ వ్యక్తి అంటూ ప్రశంసలు కూడా కురిపించారు. తులసి గబార్డు 21 ఏళ్ల పిన్న వయసులోనే హవాయ్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఇంత పిన్న వయస్కురాలైన శాసనసభ్యురాలు అంతవరకూ హవాయ్ శాసనసభలో లేరు. అయితే శాసనసభ్యురాలిగా ఒక పర్యాయం మాత్రమే ఆమె కొనసాగారు. ఆమె పనిచేస్తున్న హవాయ్ నేషనల్ గార్డు యూనిట్ ను 2004లో ఇరాక్ కు పంపారు. 2007లో
తులసి ‘కమిషన్’ అయ్యారు. అలా ప్రారంభమైన ఆమె సైనిక సేవలు 2020 వరకూ కొనసాగాయి. తర్వాత అమెరికా ఆర్మీ రిజర్వుకు తులసిని వేశారు. అక్కడ ఆమె లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సేవలు అందించారు.

కాంగ్రెస్ కు ఎంపికైన తొలి హిందూ…
2009లో రెండవ పర్యాయం మధ్యప్రాచ్యంలో తన సేవలు ముగించుకుని వచ్చాక తులసి మళ్లీ హవాయ్ రాజకీయాల్లో ప్రవేశించారు. హనోలులు సిటీ కౌన్సిల్ లో విజయవంతంగా విధులు కొనసాగించారు. 2012లో తులసి అమెరికా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ కు హవాయ్ నుంచి గెలిచారు. అలా కాంగ్రెస్ కు ఎంపికైన తొలి సమోన్-అమెరికన్, హిందూ పార్లమెంట్ సభ్యురాలిగా తులసి రికార్డు స్రుష్టించారు. అప్పుడే ఆమె భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేసి ఎందరి ద్రుష్టిలోనో పడ్డారు. ఈ సందర్భంగా ‘భగవద్గీత తనకు అంతర్గతంగా ఎంతో శాంతిని ప్రసాదించిందని, అంతేకాదు జీవితంలో ఎదురైన ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొనగలిగే శక్తిని ఇచ్చింద’ని అన్నారు. ఆ భగవద్గీతా సారమే ప్రజలకు సేవలందించే నాయకురాలు తాను కావాలని, ఆ దిశగా తన జీవితం కొనసాగాలనే ఆకాంక్షను తనలో కలిగించించాయని, అందుకోసం పోరాడేలా స్ఫూర్తిని అది ఇచ్చిందని కూడా తులసి గబార్డు చెప్పడం మరవలేము.
డెమోక్రాట్ కా మొదలై…
తులసి రాజకీయ జీవితం డెమొక్రాటిక్ పార్టీతో మొదలయింది. డెమొక్రాటిక్ లీడర్ నాన్సీ పెలోసి తులసి గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘ పార్టీ రైజింగ్ స్టార్’ అంటూ ఆమెను అభివర్ణించారు. అయితే విదేశీ విధానానికి సంబంధించి తులసి తీసుకున్న పొజిషన్ చాలామంది రాజకీయ నాయకులకు పడలేదు. దాని కారణంగా 2015లో తులసి పెద్దెత్తున విమర్శలపాలయ్యారు కూడా. సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్ అసాద్ పాలనకు వ్యతిరేకంగా సిరియా ప్రతిపక్షాలు చేపట్టిన ఉద్యమాలకు ఒబామా ప్రభుత్వం ఇస్తున్న మద్దతును ఆపాలంటూ తులసి వ్యాఖ్యానించారు. ‘అసాద్ను తొలగించాల్సిన అవసరం లేదం’టూ వ్యాఖ్యానించారు. అసాద్ ప్రభుత్వాన్ని కూలదోస్తే ఇస్లామిస్ట్ తీవ్రవాద గ్రూపులు అధికారాన్ని చేజిక్కించుకుంటాయం’ టూ విమర్శించారు. ఈ మాటలతో ఆమె ఎందరో డెమోక్రాట్లు నుంచి తీవ్ర నిరశన సెగలను ఎదుర్కొన్నారు. అంతేకాదు 2020 లో ఇరాన్ టాప్ జనరల్ ఖాసిం సొలైమాని మీద డ్రోస్ దాడి చేయాలంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తులసి తీవ్రంగా ఖండించారు. ఆ చర్య రాజ్యాంగబద్ధమైంది కాదని అన్నారు. అంతేకాదు భయంకరమైన హింస, దాడులకు అది దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. రష్యా-ఉక్రైయిన్ యుద్ధంపై డెమోక్రాటిక్ పార్టీ తీసుకున్న పొజిషన్ నచ్చని తులసి డెమోక్రాటిక్ పార్టీని విడిచి బయటకు వచ్చేశారు. ఉక్రైయిన్ యుద్ధ విషయంలో జోబైడన్ ప్రభుత్వం చేబట్టిన చర్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ఆ సందర్భంగా రష్యాను, పుతిన్ ను వెనకేసుకు వచ్చారనే విమర్శలను చాలా వైపుల నుంచి ఆమె ఎదుర్కొన్నారు. అలా 2022లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తులసి గబార్డు కొంతకాలం స్వతంత్ర అభ్యర్థిగానే కొనసాగారు. ఆ తర్వాత ట్రంప్ కు, ఆయన విధానాలకు మద్దతును తెలపడం, ఆ తర్వాత కొద్ది నెలల ముందే అంటే ఈ ఏడాది అక్టోబర్ లో రిపబ్లిక్ పార్టీలో చేరడం జరిగింది.

కీలక విధులెన్నో…
అమెరికా డైరక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలెజెన్సీ (డిఎన్ఐ) గా దేశంలోని 18 నిఘా సంస్థలకు అధిపతిగా ఆమె వ్యవహరిస్తారు. అంతేకాదు ప్రెసిడెంట్ డెయిల్ బ్రీఫ్స్ ను కూడా ఆమె కోఆర్డినేట్ చేయాలి. ‘మార్నింగ్ ఇంటెల్జెన్సీ సమ్మరీ’ చాలా ముఖ్యమైంది. అలాగే నేషనల్ సెక్యూరిటీ విషయంలో అందించే సలహాలు కూడా చాలా కీలక పాత్ర వహిస్తాయి. తులసిలోని భయపడని నైజాన్ని ట్రంప్ ప్రస్తావించడం, గతంలో విదేశీ విధానాలపై ఆమె వ్యహరించిన తీరు, అమెరికా మిలటరీలో ఆమె విస్త్రుత అనుభవం ఉండడం వంటివి ట్రంప్ ఆమెను ఈ పదవికి ఎంచుకోవడంలో కీలకమవుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఈ సందర్భంగా తులసిని ట్రంప్ గొప్ప వ్యక్తిగా పేర్కొనడం, అమెరికాకు గొప్ప కీర్తిని ఆమె తీసుకువస్తారని అనడం కూడా గమనార్హం.
అంతర్జాతీయంగానూ సంచలనమే..
దేశ ఇంటెల్జెన్సీ చీఫ్ గా గబార్డు పేరు అమెరికా మిత్రదేశాలకు కన్నెర్ర అయ్యాయి. యుఎస్, యుకె, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లకు ఈ నిర్ణయం ఇబ్బందిగా నిలవనుంది. తులసి గబార్డును అమెరికా
ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ట్రంప్ ప్రకటించడం దేశంలోనే కాకుండా అంతర్జాతీయ ఇంటెల్జెన్సీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఉత్సుకతను, ఆందోళనలను కూడా రేపుతోంది. ఇందుకు తులసి ‘అన్ కన్వెన్షల్ వ్యూస్’ తో పాటు ప్రొ-రష్యా స్టాండ్ కూడా కారణాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు రెండవ పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ అప్రోచ్ లోని ఈ షిఫ్ట్ పలు చర్చలకు కారణమవుతోంది. అంతేకాదు గబార్డు స్వతంత్ర వ్యవహారశైలి కూడా ఇందుకు ఇంకొక కారణం. వీటితో పాటు ఆమె విస్త్రుత మిలటరీ సేవల అనుభవంతో పాటు ఆమె సనాతన సంప్రదాయ రహిత విదేశీ విధానాల తీరు కూడా మరో ముఖ్య అంశం. తులసిలోని యాంటి- ఇంటర్వెన్షనిస్ట్ ధోరణులు, పాలసీలు కూడా ఇంకొక ప్రధాన కారణం.
ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ అన్న సిద్థాంత భావజాలానికి కూడా తులసి బాగా ఆకర్షితురాలయ్యారు. తులసిని నిత్యం ‘ఫాలో’ అయ్యేవారు ఆమె యుఎస్ మిలటరీ వ్యూహాలపై చేసిన విమర్శలూ మర్చిపోలేరు. మరీ ముఖ్యంగా మధ్యప్రాచ్యం విషయంలో ఆమె చేసిన విమర్శలు అందరికీ గుర్తుండే ఉంటాయి. అదే డెమోక్రాటిక్ పార్టీలో ఆమెని ఇబ్బందుల్లో పడేసింది. చివరకు ఆ పార్టీ నుంచి ఆమె బయటకు
వచ్చేయడానికి కారణమైంది.

తులసి గబార్డు 2020లో డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష రేసు ప్రచారంలో మాట్లాడుతూ అమెరికా మిలటరీ జోక్యాన్ని తీవ్రంగా నిరశించారు. అమెరికా మిడిల్ ఈస్ట్ ఘర్షణలు ఆ ప్రాంత అస్థిరతకు కారణమవడంతో పాటు అమెరికా భద్రతా విషయంలో సర్దుబాటు ధోరణుని తీవ్రంగా దుయ్యబట్టారు. తులసి మిలటరీ కెరీర్ విస్త్రుతమైనది. ఆమె దేశ ఆర్మీ నేషనల్ గార్డులో 20 సంవత్సరాల పాటు కొనసాగారు. ఆపరేషన్ ఇరాక్ ఫ్రీడమ్ 3 సందర్భంలో తులసి కంబాట్ మెడికల్ బాడ్జ్ ని అందుకున్నారు. సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్ ను తులసి వివాహం చేసుకున్నారు. తులసి తండ్రి మైక్ స్టేట్ సెనేటర్. ఆయన రిపబ్లికన్ నుంచి డెమోక్రాట్ మార్గం లోకి వెళ్లడం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News