Sunday, November 17, 2024
Homeనేషనల్PM Modi: ప్రధాని మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

PM Modi: ప్రధాని మోదీకి నైజీరియా అత్యున్నత పురస్కారం

PM Modi| ప్రధాని మోదీకి మరో దేశ అత్యున్నత పురస్కారం లభించింది. ఆఫ్రికన్ దేశమైన నైజీరియా ఆ దేశ అత్యున్నత పురస్కారమైన “ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ నైజర్” బిరుదుతో మోదీని సత్కరించనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ పురస్కారం అందుకున్న రెండో విదేశీ నేతగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. మోదీ కంటే ముందు బ్రిటన్ మాజీ క్వీన్ ఎలిజబెత్‌కు ఈ గౌరవం దక్కింది. ఆమెను 1969లో ఇదే అవార్డుతో సత్కరించారు.

- Advertisement -

కాగా మూడు దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రస్తుతం మోదీ నైజీరియాలోనే ఉన్నారు. గత 17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. నైజీరియా చేరుకున్న మోదీకి అక్కడి ప్రవాస భారతీయులు, నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు ఘన స్వాగతం పలికారు. నైజీరియా పర్యటన అనంతరం మోదీ బ్రెజిల్ వెళ్లనున్నారు. కాగా ఇప్పటి వరకు 15 దేశాలు మోదీని తమ దేశ అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News