Sunday, November 17, 2024
HomeతెలంగాణSeethakka: 22 ఇందిరా మహిళా శక్తి భవనాల జాబితా విడుదల

Seethakka: 22 ఇందిరా మహిళా శక్తి భవనాల జాబితా విడుదల

Seethakka| తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇందిరా మహిళా శక్తి భవనాల(Indira Mahila Shakti Bhavans) జాబితాను మంత్రి సీతక్క విడుదల చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటిశ్వ‌రుల‌ను చేయ‌డ‌మే ల‌క్ష్యమని తెలిపారు. గ్రామీణ మ‌హిళ‌ల‌ను పారిశ్రామిక వెత్త‌లుగా తీర్చిదిద్దేలా కార్యాచ‌ర‌ణ‌ రూపొందించామన్నారు. విజయోత్సవ స‌భ వేదిక‌గా మ‌హిళల‌ ఆర్దిక బ‌లోపేతం కోసం స‌రికొత్త‌ ప‌థ‌కాలు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు.

- Advertisement -

22 జిల్లాల్లో ఇందిరా మ‌హిళా శ‌క్తి భ‌వ‌నాల నిర్మాణానికి ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శంకుస్థాప‌న‌ చేస్తానని వెల్లడించారు. అలాగే మ‌హిళా సంఘాల‌కు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ప్ర‌భుత్వం కేటాయించ‌నున్నామని తెలిపారు. దేశ చరిత్ర‌లో మ‌హిళా సంఘాల‌కు తొలిసారిగా విద్యుత్ ప్లాంట్లు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా మ‌హిళా సంఘాల సభ్యుల‌కు భీమా సౌక‌ర్యం..ట్రాన్స్ జెండ‌ర్ల‌ కోసం జిల్లా కేంద్రాల్లో ప్ర‌త్యేక‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని సీతక్క చెప్పుకొచ్చారు.

కాగా ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో భవన నిర్మాణానికి రూ.5 కోట్ల చొప్పున 22 భవనాల నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్వయం సహాయక సంఘాల‌ను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవన్‌లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News