తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు(EV) కొనే వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. విద్యుత్ వాహనాల రిజిస్ట్రేషన్‌కు 100 శాతం ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఢిల్లీలో లాగా హైదరాబాద్‌లో కూడా కాలుష్యం లేకుండా ఉండేందుకు ఈవీ పాలసీ తీసుకచ్చామన్నారు. ఈ పాలసీ రేపటి నుంచి 2026, డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈమేరకు జీవో 41 విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ఈ జీవో ప్రకారం ఈవీల్లో బైక్‌లు, ఆటో, ట్రాన్స్‌పోర్ట్, బస్సులకు వందశాతం పన్ను 100 శాతం మినహాయింపు ఇచ్చామని ఆయన వెల్లడించారు. వీటితో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కూడా ఉంటుందన్నారు. ఈ పాలసీ ద్వారా వినియోగదారులకు ఏడాదికి సుమారు లక్ష రూపాయలు వరకు మిగులుతాయని చెప్పుకొచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సలు తీసుకొస్తామని చెప్పారు. అందుకే ప్రజలు విద్యుత్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలి అని పొన్నం కోరారు.