Friday, September 20, 2024
HomeఆటKarimnagar: కరాటే పోటీలలో జమ్మికుంట విద్యార్థులకు పతకాలు

Karimnagar: కరాటే పోటీలలో జమ్మికుంట విద్యార్థులకు పతకాలు

కరీంనగర్ పట్టణంలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో జమ్మికుంట క్రీడాకారులు పలు పతకాలు సాధించారు. కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఈ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఇందులో జమ్మికుంటలోని డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా స్కూల్ విద్యార్థులు ఇన్స్ట్రక్టర్ సుంకరి యాదయ్య పర్యవేక్షణలో పాల్గొన్నారు కటాస్ విభాగంలో చిట్టి మల్ల విధాన్, షణ్ముఖ, గుజ్జుల కార్తికేయ, దాట్ల ఆదిత్యలు ప్రథమ స్థానంతో గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు. మడికొండ విశ్వంత్ రావు స్పారింగ్ లో గోల్డ్ మెడల్ కటాస్ లో సిల్వర్ మెడల్ సాధించాడు. వీరికి కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు చేతుల మీదుగా బహుమతులు అందించారు. కరాటే పోటీలలో జమ్మికుంట పట్టణానికి చెందిన విద్యార్థులు మెడల్స్ సాధించినందుకు పట్టణంలోని క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News