లగచర్ల (Lagacherla) ఫార్మా భాదితులు సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. కొద్దిసేపటి క్రితం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ విజయభారతి సాయని తో భేటీ అయ్యారు. తమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బంధువులు వేధిస్తున్నారని జాతీయ మానవ హక్కుల సంఘం కమిషన్ చైర్ పర్సన్ కి ఫిర్యాదు చేశారు.
పోలీసులు తమ కుటుంబసభ్యులను అక్రమంగా అరెస్టు చేశారని, తమపై దాడి చేస్తున్నారని జాతీయ కమిషన్ ఎదుట లగచర్ల ఫార్మా బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. చట్టపరంగా దోషులను శిక్షించాలని వేడుకున్నారు. భాదితుల వెంట బీఆర్ఎస్ ఎంపీలు సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర నాయక్, హరిప్రియ నాయక్, బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పలువురు కొడంగల్ నియోజకవర్గ నాయకులు ఉన్నారు.