మహారాష్ట్ర ఎన్నికల (Maharashtra Elections) ప్రచారానికి నేటితో తెరపడనుంది. మరి కొన్ని గంటల సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి. అన్ని పార్టీల అగ్రనేతలు ఇవాళ రంగంలోకి దిగి ప్రచారానికి ఫైనల్ టచ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నేటి సాయంత్రం ఐదు గంటలకు మహారాష్ట్ర ఎన్నికల (Maharashtra Elections) ప్రచారం బంద్ కానుంది. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో జత కట్టిన బీజేపీ మహాయుతి కూటమిగా ప్రజల్లోకి వెళుతోంది. మరోసారి గెలిచి మహారాష్ట్ర అధికార పీఠం దక్కించుకుంటామని మహావికాస్ అఘాడీ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రచారానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉండటంతో నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.