ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఏడు కీలక బిల్లులకు శాసనసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు-2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు-2024 బిల్లులకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది.
అలాగే ఎంత మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలు మారుస్తూ తీసుకొచ్చిన బిల్లు ఏపీ అసెంబ్లీ (AP Assembly) లో ఆమోదం పొందింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు-2024, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్ట సవరణ, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు-2024, ఏపీ సహకార సంఘం సవరణ బిల్లు-2024 బిల్లులకు శాసనసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు.