Monday, November 18, 2024
Homeనేరాలు-ఘోరాలుMiyapur | మైనర్ మిస్సింగ్, మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు

Miyapur | మైనర్ మిస్సింగ్, మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు

మియాపూర్ (Miyapur) మైనర్ మిస్సింగ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొన్నాయి. అక్టోబర్ 31న బాలిక ఇంటి నుంచి బయటకి వెళ్తే, ఈ నెల 8 న తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకి ఈ నెల 17న ఆమె శవం లభించింది. మర్డర్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడే హంతకుడని తెలిసింది. అయితే పోయిన నెలలోనే బాలిక ఇంటి నుంచి వెళ్ళిపోతే ఈ నెల 8 వరకు పేరెంట్స్ ఎందుకు కేసు పెట్టలేదు? ప్రియుడే ఎందుకు హత్య చేశాడు అనే అంశాలు సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి.

- Advertisement -

కాగా, హైదరాబాద్ మియాపూర్ (Miyapur) కి చెందిన ఐశ్వర్య (17) హత్యకి సంబంధించి ఆమె బంధువులు మీడియాకి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. బాలికకి బ్యాండ్ టీమ్ లో ఒకడైన చింటూ అనే యువకుడితో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. ఆ స్నేహంతోనే అక్టోబర్ 31 న ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్ళిపోయి, ఉప్పుగూడకి చెందిన చింటూ ఇంటికి చేరింది. కానీ, తల్లిదండ్రులతో టచ్ లోనే ఉంది.

ఈ నెల 8వ తేదీన ఐశ్వర్య తల్లిదండ్రులకు ఫోన్ చేయలేదు. దీంతో ఆమె పేరెంట్స్ చింటూకి ఫోన్ చేస్తే మీ ఇంటికే వెళుతున్నా అని చెప్పింది, అక్కడికి రాలేదా అంటూ తిరిగి బుకాయించడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులని ఆశ్రయించారు. చింటూ గురించి కూడా పోలీసులకి చెప్పారు. ఐశ్వర్య పేరెంట్స్ ఫిర్యాదు మేరకు ఈ నెల 10న మిస్సింగ్ కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు చింటూని కాంటాక్ట్ చేయగా వారికి కూడా చింటూ సేమ్ స్టోరీ చెప్పాడు. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికే వెళ్తున్నా అని చెప్పి వెళ్లిందని చెప్పాడు. ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తూ, పోలీసులకి మాయమాటలు చెప్పి విచారణకి అటెండ్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. చింటూని పట్టుకుంటే కేసు సాల్వ్ అవుతుందని పోలీసులు ఫిక్సయ్యారు. దీంతో ఈ నెల 17 న ఇంటివద్ద బండిపై వెళుతున్న చింటూని పట్టుకుని మియాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా చింటూ అసలు విషయం కక్కేశాడు. ఐశ్వర్యని చంపి తుక్కుగూడ వద్ద పొదల్లో పడేశామని చెప్పాడు. ఈ నెల 8న ఐశ్వర్య, తాను పెళ్లి చేసుకున్నామని కూడా వెల్లడించాడు. పెళ్లి చేసుకుని ఎందుకు చంపేశావ్ అని ప్రశ్నించగా… ఆమె ఇంస్టాగ్రామ్ లో వేరొకరితో చాట్ చేస్తుందని, అందుకే కోపంతో చంపేసినట్లు చింటూ వెల్లడించాడు. అయితే, పోలీసులు ఆమెని రేప్ చేసి, హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా విచారణ చేస్తున్నారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న చింటూ ఇద్దరు స్నేహితులని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News