Monday, November 18, 2024
HomeతెలంగాణVemulawada | వేములవాడ ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు

Vemulawada | వేములవాడ ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు

తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వేములవాడ (Vemulawada) ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు విడుదల చేసింది. సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కోసం రూ.127.65 కోట్లు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

- Advertisement -

వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాల కోసం రూ.76 కోట్లు విడుదల చేసింది. వేములవాడ ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న రోడ్లును వెడల్పు చేసేందు రూ.47.85 కోట్లు, మూలవాగులో ఉన్న బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు పైప్లైన్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.3.8 కోట్ల పనులకు ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News