రాజకీయంగా ఎదురు,బెదురేలేని లేని ఉక్కు నేత కేసీఆర్ అని, ఆయన పేరు వింటేనే కాంగ్రెస్, బీజేపీలకు వణుకు పుడుతుందని, ఆయన సంస్కారం ముందు ప్రత్యర్ధులు తలదించుకుంటారని పేర్కొన్నారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రజలంతా కేసీఆర్ కి వెన్నుదన్నుగా ఉన్నారని, సబ్బండ వర్గాలూ కారు, సారు, కేసీఆర్ వైపేనంటూ జీవన్ రెడ్డి తేల్చిచెప్పారు. కేసీఆర్ కాకుండా ఏ పార్టీ వచ్చినా ఉచిత పథకాలకు ముప్పు పొంచి ఉందని, ఉచిత పథకాలకు ఉప్పు పాతరేస్తారంటూ.. కాంగ్రెస్, బీజేపీల పట్ల అప్రమత్తంగా ఉండాలి, అని ఆయన హెచ్చరించారు.
ఆర్మూర్ రూరల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన వందలాది గౌడ సామాజికవర్గం కుటుంబాలంతా వివిధ పార్టీలకు గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. గౌడ సంఘాల ముఖ్య నాయకులు ప్రవీణ్ గౌడ్, రవితేజ గౌడ్, వంశీ, మహేందర్, సురేందర్, సుదర్శన్, నర్సాగౌడ్ తదితరుల నాయకత్వంలో వందలాది మంది ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ ఎస్ పార్టీలో చేరారు.