Tuesday, November 19, 2024
Homeతెలంగాణరైతులకు, శాస్త్రవేత్తలకు TPCC వ్యవసాయ ప్రతిభా పురస్కారాలు

రైతులకు, శాస్త్రవేత్తలకు TPCC వ్యవసాయ ప్రతిభా పురస్కారాలు

కాళేశ్వరంతో సంబంధం లేకుండా ఈ సంవత్సరం తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి కావడానికి దూర దృష్టితో ఆనాటి కాంగ్రెస్ పాలకులు నిర్మాణం చేసిన బహుళార్థక సాధక ప్రాజెక్టుల వల్లనే సాధ్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన ఇందిరా గాంధీ వ్యవసాయ ప్రతిభా పురస్కారాల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఆదర్శ రైతులకు, శాస్త్రవేత్తలకు అవార్డులను ప్రధానం చేశారు. ఇండియా గుండె చప్పుడు ఇందిరా అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

- Advertisement -

అనంతరం సభలో రైతులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడుతూ… కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన విషయం నేడు వాస్తవమైందన్నారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి… నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా… ఎన్డీఎస్ఎ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా ఈ సంవత్సరం వరి ఉత్పత్తి పెరగడానికి ఆనాటి కాంగ్రెస్ పాలకులు కృష్ణా నదిపై నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, నెట్టెంపాడు, కోయిల, కల్వకుర్తి ఎత్తిపోతల, గోదావరి నదిపై ఎస్సారెస్పీ, దేవాదుల, శ్రీపాద ఎల్లంపల్లి తదితర బహుళార్థక సాధక ప్రాజెక్టులు నిర్మాణం చేసి రైతులకు సాగునీరు అందించిన ఫలితమే అన్నారు.‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News