Lagacharla| వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2 నిందితుడు సురేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో సురేశ్‌ను కొడంగల్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. దాడి జరిగిన నాటి నుంచి సురేశ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడే పోలీసుల ఎదుట లొంగిపోవడం గమనార్హం.
కాగా ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం రైతులతో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు లగచర్ల గ్రామ శివార్లలో సభ ఏర్పాటుచేశారు. అయితే నిందితుడు సురేశ్ ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్ద నుంచి ఊరిలోకి తీసుకెళ్లడంలో సురేశ్ కీలకంగా వ్యవహరించాడు. ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ముందుకు దూసుకురావడంతో గందరగోళం నెలకొంది. కలెక్టర్ వాహనం దిగిన క్షణాల వ్యవధిలోనే దాడి జరగడంతో సురేశ్.. అంతకుముందే రైతులను రెచ్చగొట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.