వైజాగ్ (Vizag) లో గ్యాంగ్ రేప్ ఘటన సంచలనంగా మారింది. లా విద్యార్థిని పై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడ్డారు. వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామంటూ బెదిరించి ఆమెపై బలాత్కారం చేశారు. వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం చేయడంతో అసలు విషయం బయటకి వచ్చింది.
వైజాగ్ (Vizag) గాజువాకకి చెందిన ఓ యువతి లా థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆమె గత సంవత్సరంన్నరగా వంశీ అనే యువకుడితో ప్రేమలో ఉంది. అయితే వంశీ ఓ రోజు ఆమెని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తన స్నేహితుడి రూమ్ కి తీసుకెళ్లాడు. ఆమెకి మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న సమయంలో వంశీ ముగ్గురు స్నేహితులు ఆనంద్, రాజేష్, జగదీష్ సీక్రెట్ గా వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియో చూపించి ఆమెపై ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారం (Gang Rape) చేశారు. విషయాన్ని బయటకు చెబితే వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని యువతిని బెదిరించారు.
Also Read : మైనర్ మిస్సింగ్, మర్డర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
రెండు నెలల తర్వాత ఆ వీడియోలు చూపించి మళ్లీ ఆమెను లొంగదీసుకోవడానికి నలుగురూ కలిసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. వారి వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన తండ్రి కూతురుని కాపాడాడు. విషయం తెలుసుకుని గాజువాక పోలీస్ స్టేషన్ లో యువకులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు. పూర్తి వివరాలు సేకరించేందుకు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. అత్యాచారానికి పాల్పడిన నలుగురిలో ముగ్గురు లా స్టూడెంట్స్ ఉన్నారు.
హోంమంత్రి అనిత సీరియస్…
లా స్టూడెంట్ పై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. అత్యాచారానికి పాల్పడిన యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.