హైదరాబాద్ గచ్చిబౌలి (Gachibowli) లో భవనం పక్కకి ఒరిగిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి సిద్ధిక్ నగర్ లో ఐదంతుస్థుల భవనం పక్కకి వరగడంతో అందులో నివసిస్తున్న వారితోపాటు స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. పక్కనే మరో బిల్డింగ్ కోసం సెలార్ గుంత తవ్వడంతో భవనం పక్కకు ఒరిగినట్లు తెలుస్తోంది.
భవనం పక్కకి ఒరిగినట్లు గుర్తించిన నివాసితులు, స్థానికులు భయాందోళనలకు గురై ఒక్కసారిగా రోడ్డుపైకి పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. వారందరినీ సురక్షిత స్థావరానికి తరలించారు. మరి కాసేపట్లో హైడ్రాలిక్ యంత్రంతో ఆయుధంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు హైడ్రా, డిఆర్ఎఫ్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా చుట్టుపక్కల ఉన్న వారిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు.