తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు. బుధవారం ఉదయం బేగంపేట్ నుంచి హెలికాఫ్టర్ లో వేములవాడ చేరుకున్నారు. అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు సీఎం రేవంత్ కి వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వేములవాడ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాపై సీఎం వరాల జల్లు…
ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం 694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు
రూ. 76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంఖుస్థాపన
రూ.35.25 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులు
రూ. 45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన
రూ. 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ
రూ.50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులకు శ్రీకారం
రూ. 52 కోట్లతో కొనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జి పనులు , రూ. 3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి
రూ.235 కోట్లతో 4696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు భూమి పూజ
మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన
సిరిసిల్ల లో రూ. 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనం, వేములవాడలో రూ. కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంధాలయ భవనం, రూ. 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనం ప్రారంభించనున్న సీఎం
గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ
631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కు పంపిణీ