Volunteers| ఏపీలో వాలంటీవర్ వ్యవస్థపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి(Veeranjaneya Swamy) సంచలన ప్రకటన చేశారు. శాసనమండలిలో వాలంటీర్ల వ్యవస్థపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వీరాంజనేయస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 2023 ఆగస్టు తర్వాత వాలంటీర్లను రెన్యూవల్ చేయలేదన్నారు. రెన్యూవల్ చేయకుండా వాలంటీర్లు, ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు.
గత ప్రభుత్వం చర్యల వల్లే ఆ వ్యవస్థ మనుగడలో ఏకుండా పోయిందన్నారు. ఉద్యోగంలో లేని వారి చేత రాజీనామాలు చేయించడంతో పాటు జీతాలు చెల్లాంచారని తెలిపారు. వ్యవస్థలో లేని ఉద్యోగులకు వేతనాలు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు. వాళ్లు విధుల్లో ఉంటే కొనసాగించే వాళ్లమని స్పష్టం చేశారు. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ లేరని బాంబ్ పేల్చారు. మరోవైపు వాలంటీర్లను కొనసాగిస్తామని జీతం పెంచుతామని ఎన్నికల్లో ఎందుక హామీ ఇచ్చారని మండిలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు.