కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) ని అరెస్టు చేసిన తీరును తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. టెర్రరిస్ట్ లాగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అని పోలీసులను ప్రశ్నించింది. కేబీఆర్ పార్కు వద్ద వాకింగ్‌కు వెళ్లినప్పుడు మాజీ ఎమ్మెల్యేను ఓ ఉగ్రవాదిలాగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని నిలదీసింది.
పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) పరారీలో ఉన్నారా అని పీపీని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆయన అరెస్టు విషయంలో సుప్రీం కోర్టు నిబంధనలు పాటించలేదని హైకోర్టు సీరియస్ అయింది. మరోవైపు దాడికి గురైన అధికారుల గాయాలపై సరిగ్గా నివేదించలేదని హైకోర్టు మండిపడింది. తీవ్రగాయాలైనట్లు రిపోర్టు ఇచ్చి, చిన్న గాయాలైనట్లు రాశారని పేర్కొంది. అలాగే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.