Wednesday, November 20, 2024
HomeఆటIND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పేరు ఎలా వచ్చింది..? మ్యాచుల టైమింగ్స్ ఎప్పుడంటే..?

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పేరు ఎలా వచ్చింది..? మ్యాచుల టైమింగ్స్ ఎప్పుడంటే..?

IND vs AUS| భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టెస్టు మ్యాచుల సిరీస్‌ను బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) అని పిలుస్తారు. అయితే ఈ రెండు జట్ల టెస్టు సిరీస్‌కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఎందుకు పిలుస్తున్నారనేది చాలా మందికి తెలియదు. అసలు ఈ సిరీస్‌కు ఆ పేరు ఎలా పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

1996లో ఏకైక టెస్టు ఆడటానికి ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది. అయితే అప్పుడు టెస్టుల్లో దిగ్గజ క్రికెర్లు అయిన సునీల్ గవాస్కర్, అలెన్ బోర్డర్‌లు 10వేల పరుగులు సాధించారు. వారి గౌరవార్థం సిరీస్ నిర్వహిద్దామని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు భావించాయి. అప్పటి నుంచి ఇరు జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌ను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీగా పిలుస్తున్నారు. ఇప్పటివరకు 16 సార్లు ఇరు జట్ల మధ్య బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ జరిగగా.. పది సార్లు భారత్ విజయం సాధించింది. మిగిలిన ఆరు మ్యాచుల్లో ఆస్ట్రేలియా 5 సార్లు గెలవగా.. ఒక సిరీస్ డ్రాగా ముగిసింది.

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ట్రోఫీని 2016/17 నుంచి టీమిండియానే గెలుస్తుంది. అయితే ఈసారి మాత్రం గెవలడం కాస్త కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల సొంతగడ్డపై జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్‌కు వెళ్లాలంటే ఈ సిరీస్‌ను 4-0తో గెలవాలి. దీంతో ఈ సిరీస్ రోహిత్ సేనకు అత్యంత కీలకంగా మారింది.

మరోవైపు ఈ ఆస్ట్రేలియాలో జరిగే మ్యాచుల టైమింగ్స్ భారత టైమింగ్స్‌కు భిన్నంగా ఉంటాయి. ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్.. టైమింగ్స్..

నవంబర్ 22-26: తొలి టెస్టు- పెర్త్ (ఉదయం 7.50 గంటలకు)
డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్)- అడిలైడ్ (ఉదయం 9.30 గంటలకు)
డిసెంబర్ 14-18: మూడో టెస్టు- బ్రిస్బేన్ (ఉదయం 5.50 గంటలకు)
డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు- మెల్‌బోర్న్ (ఉదయం 5 గంటలకు)
జనవరి 03-08: అయిదో టెస్టు- సిడ్నీ (ఉదయం 5 గంటలకు)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News