50వేల ఉద్యోగాలకు ఒక్కటి తగ్గినా క్షమాపణ చెబుతానని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడిన ఆయన… స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్రం కూడా అధికారంలోకి వచ్చిన పది నెలల్లో 50వేల ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. ఆ ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు.
- Advertisement -
“పది నెలల్లో 50వేల ఉద్యోగాలు ఇచ్చాం.. లెక్క కట్టి చూపిస్తా.. ఒక్క తల తగ్గినా నేను క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా.. మీ పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో… మా పదినెలల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో చర్చకు పెడదాం రా..” అంటూ కేసీఆర్ కి రేవంత్ సవాల్ విసిరారు.