Wednesday, November 20, 2024
HomeఆటMakthal: క్రీడలతో గౌరవం, ఉన్నత స్థాయి

Makthal: క్రీడలతో గౌరవం, ఉన్నత స్థాయి

ట్రైనింగ్

తెలంగాణ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కర్ని గ్రామంలో పిడి బి. రూప ఇంచార్జ్ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుండి 22 వరకు పది రోజుల పాటు జరుగుతున్న తెలంగాణ 43వ జాతీయ జూనియర్ బాలబాలికల ఖోఖో శిక్షణ శిబిరాన్ని బుధవారం రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, కె. రఘు ప్రసన్న బట్ సందర్శించి, తెలంగాణ ఖోఖో జాతీయ బాలబాలికల జట్ల క్రీడాకారులను, క్రీడాకారిణులను పరిచయం చేసుకొని అభినందించారు.

- Advertisement -

అనంతరం వారు మాట్లాడుతూ… గెలుపు ఓటములు సహజమని, చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందాలని, క్రీడల వలన అనేక లాభాలు ఉంటాయని, మానసిక ఉల్లాసము, సమాజంలో గౌరవం, శారీరక దృఢత్వము జ్ఞాపక శక్తి పెరుగుతుందని, జాతీయ స్థాయిలో మీరు రాణించి తెలంగాణ కీర్తి ప్రతిష్టను పెంచాలని, మారుమూల గ్రామమైన కర్నిలో జాతీయస్థాయి ఖోఖో శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్న పాఠశాల పీడీ బి. రూపను అభినందిస్తూ ఒక మహిళ ధైర్యం చేసి ఈ గ్రామంలో జాతీయ స్థాయి ఖోఖో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడము అభినందనీయమని ఈ శిక్షణా శిబిరానికి తన వంతుగా రూ.25,000 నగదును ఇంచార్జ్ పి డి, బి రూపకు అందజేశారు. మునుముందు క్రీడలకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.

కే రఘు ప్రసన్న బట్టు మాట్లాడుతూ… క్రీడాకారులకు క్రీడలకు నా వంతు పూర్తి సహకారం అందిస్తానని, వారు జాతీయస్థాయిలో రాణించాలని ఆయన తెలిపారు. రాష్ట్ర ఖోఖో అకాడమీ కోచ్ లు రంజిత్, సతీష్ మాట్లాడుతూ ఈ శిక్షణా శిబిరంలో జాతీయస్థాయి 20 మంది బాలికలు, 20 మంది బాలురు మెరుగైన శిక్షణ పొందుతున్నారని, వీరు ఈనెల 25 నుండి 29 వరకు ఉత్తర ప్రదేశ్ మీరట్ లో జరుగు జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటారని, శిబిరానికి దాదాపు రెండు లక్షల 50 వేలు ఖర్చు అవుతుందని దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహకారాన్ని అందించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో ఖోఖో జిల్లా ఉపాధ్యక్షుడు బి. గోపాలం, ఎస్ రమేష్ రావు, మాజీ విద్యా కమిటీ చైర్మన్ రంగప్ప, బిజెపి చిట్యాల మాజీ సర్పంచ్ లక్ష్మణ్, ఖోఖో జాతీయస్థాయి క్రీడాకారులు ఉద్యోగులైన బీ.రూప .బి .దీప, బి. శిల్ప, బి. పుష్ప, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News