Assembly Elections| మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, జార్ఖండ్ రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతం ముగిసింది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగగా.. జార్ఖంగ్‌లోని 81 స్థానాలకు గాను 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో 5 గంటల వరకు 58.22శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం పోలింగ్ పూర్తి అయితే 65శాతం పైగా పోలింగ్ నమోదుకావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో 67.59 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు రెండు రాష్ట్రాల్లో ఓటర్లు ఓటు వేయడానికి పోటెత్తారు. మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌లో ఎవరు అధికారంలోకి వస్తారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా నవంబర్ 23న రెండు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు రిలీజ్ అవ్వనున్నాయి.