Kasturi: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో జైలు కెళ్లిన నటి కస్తూరి(actress kasthuri)కి భారీ ఊరట లభించింది. ప్రస్తుతం చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కస్తూరి.. చెన్నై ఎగ్మోర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. తన కుమారుడు ఆటిజంతో బాధ పడుతున్నాడని ఈ పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్పై పోలీసులు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో న్యాయమూర్తి దయాళన్.. ఆమెకు షరతులతో కూడిన బెయిల్(conditional bail) మంజూరు చేశారు.
కాగా తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కస్తూరిని పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి చెన్నై తరలించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెను ఎగ్మోర్ కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది. దీంతో కస్తూరిని చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు.