DEO| విద్యాధికారిగా ఉన్నత పదవిలో ఉన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన అధికారి అదుపుతప్పారు. భార్యగా అండగా ఉంటానని మాట ఇచ్చిన ఆయన.. భర్త స్థానాన్ని కూడా అభాసుపాలు చేశారు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డదారి తొక్కారు. ఆయనే నల్లగొండ జిల్లా విద్యాధికారి(DEO) భిక్షపతి. కొంతకాలంగా వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భిక్షపతి ప్రవర్తనపై భార్యకు అనుమానం వచ్చింది. దీంతో భర్తపై నిఘా వేసిన ఆమె.. మరో మహిళతో ఉండగా కుటుంబసభ్యులతో కలిసి రెండ్ హ్యాండెడ్గా పట్టుకుంది.
తనను పెళ్లి చేసుకుని వదిలేశారని.. 14 ఏళ్తుగా కోర్టులో విడాకుల కేసు నడిపిస్ తనను ఇబ్బందులు పెడుతున్నారని ఆమె వాపోయింది. ఇప్పుడు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో మరో మహిళతోనూ ఇలాగే వ్యవహరించారని.. ఇప్పుడు ఇంకో మహిళను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాడని ఆరోపించింది. తనకు తెలియకుండా ప్రియురాలితో ముగ్గురు పిల్లను కూడ కన్నారని ఆరోపణలు చేసింది. దీంతో తన భర్త చేస్తున్న అన్యాయంపై పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటుంది. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా DEO భిక్షపతి వ్యవహారంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.