IPL 2025: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. ఐపీఎల్ 2025 టోర్నీ ప్రారంభ తేదీ ఖరారైంది. ఈమేరకు బీసీసీఐ(BCCI) కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది మార్చి 14(శుక్రవారం) నుంచి టోర్నీ ప్రారంభం కానుందని తెలిపింది. అలాగే మే 25(ఆదివారం) వరకు టోర్నీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే మ్యాచుల షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పిది.
అంతేకాకుండా 2026, 2027లలో జరగనున్న ఐపీఎల్ టోర్నీల షెడ్యూల్‌ను కూడా వెల్లడించింది. 2026 ఐపీఎల్ టోర్నీ మార్చి 15 (ఆదివారం) నుంచి మే 31 (ఆదివారం) వరకు జరుగనుంది. ఇక 2027 టోర్నమెంట్ మార్చి 14 (ఆదివారం) నుంచి మే 30 (ఆదివారం) వరకు నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉంటే ఐపీఎల్ 2025 టోర్నీ మెగా వేలం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలో ఈ మెగా వేలం జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి వేలం కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ వేలంలో స్టార్ ఆటగాడు రిషభ్ పంత్ భారీ ధర పలికే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పంత్‌తో పాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, చాహల్, షమీ వంటి ఆటగాళ్లను కూడా దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.