IND vs AUS| బోర్డర్ – గావస్కర్ ట్రోఫీ(Border–Gavaskar Trophy)లో భాగంగా పెర్త్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆటగాళ్లు తడబడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆది నుంచే వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ డకౌట్ కాగా.. వన్ డౌన్లో వచ్చిన పడిక్కల్ కూడా డకౌట్‌గా పెవిలియన్ చేరారు. ఇక స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ కూడా 5 పరుగులకే వెనుదిరిగారు. దీంతో భారత్ తక్కువ పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్‌తో రాహుల్‌ను ఔట్ చేశారు. దీంతో 26 పరుగుల వద్ద ఔట్ పెవిలియన్ బాట పట్టాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసిందతి. ప్రస్తుతం రిషభ్ పంత్ (10), ధ్రువ్ జురెల్ (4) క్రీజులో ఉన్నారు.
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచుకు అందుబాటులో లేకపోవడంతో బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. దీంతో 1947 తర్వాత ఇద్దరు బౌలర్లు సారథులుగా వ్యవహరించిన మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఇక భారత జట్టులోకి తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేశాడు. అలాగే బౌలర్ హర్షిత్ రాణా కూడా తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు.