లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసుపై విశాఖ బార్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితుల తరుపున బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని డిసైడ్ అయ్యింది. నిందితులను కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు సమిష్టిగా డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఇటీవల వైజాగ్ (Vizag) కి చెందిన లా స్టూడెంట్ పై నలుగురు యువకులు బ్లాక్ మెయిల్ చేసి గ్యాంగ్ రేప్ కి పాల్పడిన వ్యవహారం సంచలనంగా మారింది. నలుగురు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
వీడియోలు తీసి… బ్లాక్ మెయిల్ చేసి…
వైజాగ్ (Vizag) గాజువాకకి చెందిన ఓ యువతి లా థర్డ్ ఇయర్ చదువుతోంది. ఆమె గత సంవత్సరంన్నరగా వంశీ అనే యువకుడితో ప్రేమలో ఉంది. అయితే వంశీ ఓ రోజు ఆమెని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తన స్నేహితుడి రూమ్ కి తీసుకెళ్లాడు. ఆమెకి మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న సమయంలో వంశీ ముగ్గురు స్నేహితులు ఆనంద్, రాజేష్, జగదీష్ సీక్రెట్ గా వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియో చూపించి ఆమెపై ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారం (Gang Rape) చేశారు. విషయాన్ని బయటకు చెబితే వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని యువతిని బెదిరించారు.
Also Read : ప్రియురాలితో విద్యాధికారి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య
రెండు నెలల తర్వాత ఆ వీడియోలు చూపించి మళ్లీ ఆమెను లొంగదీసుకోవడానికి నలుగురూ కలిసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు. వారి వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన తండ్రి కూతురుని కాపాడాడు. విషయం తెలుసుకుని గాజువాక పోలీస్ స్టేషన్ లో యువకులపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు. పూర్తి వివరాలు సేకరించేందుకు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. అత్యాచారానికి పాల్పడిన నలుగురిలో ముగ్గురు లా స్టూడెంట్స్ ఉన్నారు.
హోంమంత్రి అనిత సీరియస్…
లా స్టూడెంట్ పై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. అత్యాచారానికి పాల్పడిన యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.