Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: అదానీ దేశం పరువు..జగన్ రాష్ట్రం పరువు తీశారు: షర్మిల

YS Sharmila: అదానీ దేశం పరువు..జగన్ రాష్ట్రం పరువు తీశారు: షర్మిల

YS Sharmila| ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ(Gautam Adani) ఏపీ మాజీ సీఎం జగన్‌(YS Jagan)కు రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తెలిపారు. ఈ కేసుతో అదానీ దేశం పరువు, జగన్‌ రాష్ట్రం పరువు తీశారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అమెరికా ఏజెన్సీలు గౌతమ్‌ అదానీ, మరికొందరిపై అభియోగాలు మోపాయన్నారు. తొలి నుంచి తాము చెబుతున్నట్లు జగన్ ప్రధాని మోదీ దత్తపుత్రుడు అని విమర్శించారు.

- Advertisement -

కొన్ని రాష్ట్రాల సీఎంలకు అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చినట్లు వెల్లడైందని పేర్కొన్నారు. మొత్తం రూ.2,100కోట్లు చెల్లించగా.. ఇందులో రూ 1,750 కోట్లు జగన్‌కు లంచం ఇచ్చినట్లు దర్యాప్తు ఏజెన్సీలు తెలిపాయని చెప్పారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నందున కేసులు పెట్టినట్లు ఆ ఏజెన్సీలు పేర్కొన్నాయని వివరించారు. అమెరికా ఏజెన్సీలు బయటపెట్టే వరకు ఇది బయటకు రాలేదని షర్మిల వెల్లడించారు. ప్రధాని మోదీ మాత్రం ఇంతవరకు దీనిపై స్పందించలేదని ఫైర్ అయ్యారు. అదానీకి మోదీ అండగా నిలుస్తున్నారని.. కేవలం ఈ 10 ఏళ్లలోనే అదానీ లక్ష కోట్లకు పడగెత్తారని ఆరోపించారు. ఇప్పటికైనా అదానీని అరెస్ట్ చేసి విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News