IND vs AUS| బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆది నుంచే తడబడింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ డకౌట్ కాగా.. వన్ డౌన్లో వచ్చిన పడిక్కల్ కూడా డకౌట్‌గా పెవిలియన్ చేరారు. ఇక స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ కూడా 5 పరుగులకే వెనుదిరిగారు. దీంతో భారత్ తక్కువ పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
మరో ఓపెనర్ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ నెమ్మదిగా ఆడుతూ స్కోరు బోర్డు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మిచెల్ స్టార్క్ అద్భుతమైన బౌలింగ్‌తో రాహుల్‌ను ఔట్ చేశారు. దీంతో 26 పరుగుల వద్ద ఔట్ పెవిలియన్ బాట పట్టాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. తర్వాత తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి 41 పరుగులు, రిషబ్ పంత్ 37 పరుగులతో పోరాడారు. దీంతో టీమిండియా ఆ మాత్రమైన స్కోర్ చేయగలిగింది. ఇక ఆసీస్ బౌలర్లలో హేజల్‌వుడ్ 4.. స్టార్క్, మిచెల్, కమిన్స్ చెరో 2 వికెట్లు తీశారు.