హీరో ప్రభాస్(Prabhas)తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ప్రభాస్ అనే వ్యక్తిని ఇంతవరకూ తాను చూడలేదని.. తన పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నానని తెలిపారు. ప్రభాస్ ఎవరో తనకు ఇప్పటికీ తెలియదన్నారు. జగన్(Jagan)కు ఇవ్వన్నీ తెలిసి క ఊడా తనకు వ్యక్తిత్వం లేనట్లు ప్రచారం చేయించారని వాపోయారు. ప్రభాస్తో సంబంధం ఉన్నట్లు గత ఐదేళ్లుగా జగన్ తన సైతాన్ సైన్యంతో సోషల్మీడియా వేదికగా విమర్శలు చేయించింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
జగన్కు చెల్లెలిపై ప్రేమ ఉందా? అని నిలదీశారు. సిగ్గులేకుండా మళ్లీ తన వీడియోనే ప్లే చేసి మైలేజీ వచ్చేటట్లు వాడుకుంటున్నారని విమర్శించారు. జగన్కు పేరు వస్తుందంటే తల్లి, చెల్లి ఎవరి పేరైనా వాడేస్తారని.. చివరకు నాన్న పేరు కూడా సీబీఐ ఛార్జ్ షీట్లో పెట్టిస్తారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనపై బాలకృష్ణ(Balakrishna) ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందంటూ ఓ వీడియో చూపించారని.. ఇలా జరిగిందని మీకు తెలిస్తే ఐదేళ్లూ ఏమి చేశారని దుయ్యబట్టారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు విచారణ చేయలేదు.. అప్పడు గాడిదలు కాశారా..? అని ప్రశ్నించారు. జగన్కు నిజంగా చెల్లి మీద ప్రేమ ఉంటే ప్రభాస్కూ, తనకూ సంబంధం ఉందని అసత్య ప్రచారంపై తాను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదని ఆమె మండిపడ్డారు.