Chhattisgarh| ఛత్తీస్‌గఢ్‌లోలోని అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్(Encounter) జరిగింది. ఒడిశా మీదుగా ఛత్తీస్‌గఢ్‌లోకి నక్సలైట్లు ప్రవేశిస్తున్నారనే పక్కా సమాచారంతో భద్రతా దళమైన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) కూంబింగ్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ప్రతిదాడిలో రిజర్వ్ గార్డ్ దళాలు కూడా కాల్పులు జరపడంతో పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పి.సుందర్‌రాజ్ తెలిపారు. ఘటనాస్థలి నుంచి భద్రతా దళాలు మూడు ఆటోమేటిక్ తుపాకులు సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా గత నెలలో ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్-దంతెవాడ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో 31 మంది మావోయిస్టులను భద్రతా దళాలు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లోనూ భద్రతా దళాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.