Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుRJ Ventures | ప్రీ లాంచింగ్ పేరిట రూ.150 కోట్ల 'రియల్' దందా

RJ Ventures | ప్రీ లాంచింగ్ పేరిట రూ.150 కోట్ల ‘రియల్’ దందా

భాగ్యనగరంలో మరో భారీ రియల్ ఎస్టేట్ దందా వెలుగు చూసింది. ప్రీ లాంచింగ్ (Pre Launching) పేరుతో బాధితుల నుంచి రూ.150 కోట్లు దోచేసిన వ్యవహారం చర్చనీయాంశం అయింది. మోసపోయామని తెలిసిన బాధితులు శుక్రవారం బషీర్ బాగ్ లోని సదరు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ముందు ఆందోళనకి దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… ఆర్జే వెంచర్స్ (RJ Ventures) అనే సంస్థ సుమారు 600 మంది నుండి ప్రీ లాంచింగ్ పేరుతో డబ్బు వసూలు చేసింది. ఒక్కొక్కరూ రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చెల్లించారు. 2020 లో తమ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వెంచర్ లో ఇప్పటి వరకు నిర్మాణాలు చేపట్టలేదని ఆరోపిస్తున్నారు.

- Advertisement -

ఆర్జే వెంచర్స్ (RJ Ventures) యాజమాన్యాన్ని నిర్మాణాలు ఎప్పుడు చేపడతారని ఎన్నిసార్లు అడిగినా బాధితులకి సరైన సమాధానం ఇవ్వలేదు. కనీసం తమ డబ్బైనా తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేస్తే బాధితులకు చెక్కులు ఇచ్చారు. కానీ అవి కూడా బౌన్స్ అయినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “నారాయణ్ ఖేడ్, ఘట్కేసర్, పఠాన్ చెర్వు కర్తనుర్ ప్రాంతాలలో అపార్ట్మెంట్, ఫార్మ్ ల్యాండ్ పేరిట ఆర్జే వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేశారు. వెంచర్ ఎండి భాస్కర్ గుప్త, డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి సుమారు 600 మంది సుమారు రూ.150 కోట్లు కట్టాం” అని బాధితులు వెల్లడించారు. మోసపోయామని భావించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాము… వెంచర్ కార్యాలయం సైబరాబాద్ పరిధిలో ఉందని తెలిపారు… అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేస్తామని బాధితులు చెబుతున్నారు. ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి తమకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News