Saturday, November 23, 2024
Homeచిత్ర ప్రభKeerthy Suresh: నటి కీర్తి సురేష్ పెళ్లి.. ఎవరితో.. ఎప్పుడంటే..?

Keerthy Suresh: నటి కీర్తి సురేష్ పెళ్లి.. ఎవరితో.. ఎప్పుడంటే..?

Keerthy Suresh| ప్రముఖ నటి కీర్తి సురేశ్ త్వరలోనే వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నారు. కేరళకు చెందిన వ్యాపారవేత్త, ఆంథోని తట్టిల్‌ను ఆమె వివాహం చేసుకోబోతున్నారని కీర్తి తండ్రి సురేష్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వారిద్దరు స్కూల్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్స్ అని.. వీరి అనుబంధం గత 14 ఏళ్లుగా సాగుతోందని పేర్కొన్నారు. వారిష్టం ప్రకారమే ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో వారి వివాహం డిసెంబర్ 11 లేదా 12న జరుగుతందని స్పష్టం చేశారు.

- Advertisement -

గోవాలోని ఓ పెద్ద రిసార్ట్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. ఇరు కుటుంబాలతో పాటు సన్నిహిత బంధువులకు మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానం పలకనున్నామని తెలిపారు. ఈమేరకు ఆంగ్ల పత్రిక ఓ కథనం వెల్లడించింది. త్వరలోనే వీరి పెళ్లిపై అధికారికంగా ప్రకటన చేయనున్నారని అందులో పేర్కొంది. దీంతో కీర్తి సురేశ్ అభిమానులు ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా చెన్నైకు చెందిన ఆంథోని ఇంజనీరంగ్ పూర్తి చేసి గల్ఫ్ కంట్రీ ఖతార్‌లో జాబ్ చేశారు. అనంతరం ఇండియాకు తిరిగి వచ్చి చెన్నై, కేరళలో వ్యాపారాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆస్తి రూ.300కోట్లకు పైగా ఉంటుందని సమాచారం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News