AP Assembly| ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. నవంబర్ 11న ప్రారంభమైన శాసనసభ సమావేశాలు దాదాపు 10 రోజుల పాటు సాగాయి. 59 గంటల 57 నిమిషాల పాటు సమావేశాలు కొనసాగాయి. 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పారు. 21 ప్రభుత్వ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. మరోవైపు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు బహిష్కరించారు.
ఇక రాష్ట్ర శాసనమండలిని కూడా నిరవధిక వాయిదా వేస్తున్నట్టు కౌన్సిల్ చైర్మన్ మోషేన్ రాజు తెలిపారు. మొత్తం 8 బిల్లులను మండలి ఆమోదించింది. చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని కూడా కౌన్సిల్ రద్దు చేసింది. అదేవిధంగా లోకాయుక్త సవరణ బిల్లు 2024కు కూడా ఆమోదం పలికింది. అలాగే విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్ర పౌరవిమానయాన శాఖను కోరుతూ మండలి తీర్మానం చేసింది.