Saturday, November 23, 2024
Homeచిత్ర ప్రభAR Rahman: రెహమాన్ విడాకుల వదంతులపై తనయుడు ఆవేదన

AR Rahman: రెహమాన్ విడాకుల వదంతులపై తనయుడు ఆవేదన

AR Rahman| ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్-సైరాభాను దంపతులు ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విడాకుల తర్వాత సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి తనయుడు అమీన్ స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

- Advertisement -

‘మా నాన్న ఒక లెజెండ్. ఎన్నో ఏళ్ల నుంచి వృత్తిపరంగా అద్భుతమైన మ్యూజిక్‌ను అందించడమే కాదు.. ఎంతో మంది ప్రేమాభిమానాలను పొందిన వ్యక్తి. ఎలాంటి ఆధారాల్లేకుండా వదంతులు వ్యాప్తి చెందడం చూస్తుంటే బాధగా ఉంది. ఒక వ్యక్తి జీవితం, లెగసీ గురించి మాట్లాడేటప్పుడు నిజం విలువ తెలుసుకోవాలి. దయచేసి ఇలాంటి అవాస్తవాలు వ్యాప్తి చేయడం ఇకనైనా ఆపండి. ఆయన్ని, వృత్తిని గౌరవిద్దాం’ అని రాసుకొచ్చాడు.

మరోవైపు వారి కుమార్తె రహీమా కూడా ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘మనల్ని ద్వేషించే వాళ్లే వదంతులు సృష్టిస్తారు. తెలివితక్కువ వాళ్లు వాటిని వ్యాప్తి చేస్తారు. పనికిరానివాళ్లు వాటిని అంగీకరిస్తారు.. దీనిని ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి’ అని తెలిపారు. కాగా 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు రెహమాన్ దంపతులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News