IND vs AUS| బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఆస్ట్రేలియా జట్టును 104 పరుగులకే కట్టడి చేశారు. ఓవర్ నైట్ స్కోర్ 67/7 పరుగుల వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టును టీమిండియా బౌలర్లు తీవ్ర ఇబ్బందులు పెట్టారు. ఈ క్రమంలోనే ఆ జట్టు వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది.
అయితే బౌలర్ మిచెల్ స్టార్ భారత బౌలర్లను అడ్డుకుంటూ 26 పరుగులు చేశాడు. చివరి వికెట్‌కు హేజిల్‌వుడ్‌తో కలిసి స్కోర్ బోర్డు కాస్త ముందుకు తీసుకెళ్లాడు. కానీ హర్షిత్ రాణా స్టార్క్‌ను ఔట్ చేయడంతో ఆస్ట్రేలియా 104 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో టీమిండియాకు 46 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు, హర్షిత్ రాణా 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు.
అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 150 పరుగులకే ఆలౌట్ అయింది. తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి 41 పరుగులు, రిషబ్ పంత్ 37 పరుగులతో రాణించారు. ఇక ఆసీస్ బౌలర్లలో హేజల్‌వుడ్ 4.. స్టార్క్, మిచెల్, కమిన్స్ చెరో 2 వికెట్లు తీశారు.