Saturday, November 23, 2024
Homeనేషనల్మహారాష్ట్ర, జార్ఖండ్ లో 11 గంటలకు ఆధిక్యంలో ఎవరు?

మహారాష్ట్ర, జార్ఖండ్ లో 11 గంటలకు ఆధిక్యంలో ఎవరు?

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో ఎవరిని అధికార పీఠం వరించనుందో మరి కొన్ని గంటల్లో తేలనుంది. విజయం ఏ కూటమిని వరిస్తుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి 213 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇండి అలయన్స్ మహావికాస్ అఘాడీ 58 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఝార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యం కనబరుస్తోంది. ఇండి కూటమి 49 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా… ఎన్డీయే 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. వాయనాడ్ లోక్ సభ స్థానంలో లక్షన్నర ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

- Advertisement -

288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక పార్టీ లేదా కూటమి 145 సీట్లు గెలవాలి. 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో మెజారిటీ సంఖ్య 41 కాగా, ఈ రెండు రాష్ట్రాల్లోనూ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఈ రెండు కూటముల్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News