Venkatesh Iyer : యూఏఈ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సెకండ్ ఫేజ్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరుపున బరిలోకి దిగి ఆ జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లాడు వెంకటేశ్ అయ్యర్. దీంతో అతడి పేరు మారుమోగిపోయింది. బ్యాటర్‌గానే కాకుండా బంతితోనూ మెరుపులు మెరిపించాడు. ఇక టీమ్ఇండియాకు ఓ కొత్త ఆల్‌రౌండర్ దొరికాడు అని మాజీలతో పాటు అభిమానులు ఎంతో ఆశించారు. అందరు ఆశించినట్లుగా అతి తక్కువ సమయంలోనే టీమ్ఇండియా జట్టుకు ఎంపికైయ్యాడు.
ఎంత త్వరగా జట్టులోకి వచ్చాడో అంతే త్వరగా మాయమైపోయాడు. ఎక్కడా కనిపించడం లేదు. కనీసం రంజీల్లో కూడా అతడి పేరు వినిపించడం లేదు. దీంతో ఈ యువ ఆల్‌రౌండర్‌కు ఏమైందని అభిమానులు సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్ అయ్యర్ స్వయంగా సోషల్ మీడియా ముందుకు వచ్చాడు.
తాను ఎక్కడికి వెళ్లలేదని చెప్పాడు. ప్రస్తుతం దేశవాలీ టోర్నీగా పుల్ బిజీగా ఉన్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో టీమ్ఇండియాలో చోటుపై పలువురు అభిమానులు ప్రశ్నించారు. దీనిపై అతడు స్పందిచాడు. జట్టుకు ఎంపికైనప్పటికీ తాను ఆశించిన విధంగా ఓపెనర్‌గా అవకాశాలు రాలేదని, ఫినిషర్ పాత్రలో వాడుకోవాలని జట్టు మేనేజ్‌మెంట్ బావించిందని చెప్పాడు. ఎప్పుడో ఒకసారి రాణించినా పూర్తిస్థాయిలో ఆ పాత్రకు తాను సరైన న్యాయం చేయలేకపోయినట్లు తెలిపాడు. ఈ లోపు హార్థిక్ పాండ్య తన పునరాగమనాన్ని గట్టిగా చాటాడని అన్నాడు.
ఐపీఎల్ 2022తో పాటు ఆసియాకప్, ప్రపంచకప్‌లలో హార్థిక్ అద్భుతంగా రాణించి జట్టులో పాతుకుపోయాడని తన హవాలో తాను కనుమరుగుఅయ్యానని వాపోయాడు. దేశవాలీ టోర్నీలో రాణించినా హార్థిక్ ఉండడంతో సెలక్టర్లు తనను పరిగణలోకి తీసుకోలేదని, టీ20 ప్రపంచకప్‌లో సత్తాను నిరూపించుకోవాలని కలలు కన్నప్పటికీ తన టైమ్ బాగాలేక ఇలా ఉండిపోయానని చెప్పాడు.